యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని, ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని పూర్వ కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. జిల్లా అధికారుల ఆధ్వర్యంలో పూర్వ కలెక్టర్ హనుమంతరావు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల జిల్లా అధికారులు TNGO, తహసీల్దారులు, MPDOలు అధికారులందరూ ఘనంగా సత్కరించారు.