MBNR: పదవ తరగతి విద్యార్థులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం జిల్లా సమీపంలోని జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ‘ముడా’ నిధులతో నిర్మించిన RO వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు.ఉమ్మడి జిల్లాను వలసల నుంచి ఉపాధి కల్పన వైపు మారుస్తున్నామని, విద్యలో జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలపాలని అన్నారు.