విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్లో శనివారం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ఆర్. గోవిందరావు శుక్రవారం తెలిపారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు వంటి అత్యవసర పరిస్థితుల్లో రక్త కొరతను తీర్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.