NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఉదయం క్లాక్ టవర్ సెంటర్లోని ఇందిరా భవన్కు చేరుకుంటారు. ప్రజలకు ఉదయం 9:30 నుంచి మ.12 గంటల వరకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజల నుంచి విజ్ఞప్తులను, వినతులను స్వీకరిస్తారు. అనంతరం ఉమ్మడి జిల్లా ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ సమగ్ర కార్యాచరణపై జరిగే సమావేశంలో పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు.