కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజలు వివిధ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తున్నారు. మంగళగిరిలో అయన ప్రజలను కలిసి వారి సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం భీమవరం కి చెందిన ఒక అమ్మాయి మిస్సింగ్ కేసును 2 వారాల్లో చేదించేలా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆగష్టు 7వ తేదీన తెలంగాణలో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు.
ఉమ్మడి రాజధాని వ్యవధి 10 ఏళ్ళు ముగిసిన కారణంగా ఏపీ డ్రైవర్లను రాష్ట్రం విడిచి వెళ్లాల్సిందిగా వారు ఆదేశిస్తున్నారని, దీని వల్ల 2 వేల కుటుంబాలు రోడ్డున పడతాయని వారు మొరపెట్టుకున్నారు. ఈ విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ…. ఆంధ్ర డ్రైవర్లపై కనికరం చూపించండి, ఇది 2వేల కుటుంభాలకు సంబందించిన సమస్య… రెండు రాష్ట్రాలు కలిసి కట్టుగా పనిచేయాలని, అప్పుడే అభివృద్ధి చెందుతామని, అన్నదమ్ముల కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.
ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ అభివృద్ధి వైపు నడవాలని, అప్పుడే మనకి అవకాశాలు వస్తాయని , అభివృద్ధి చెందితే ఆంధ్ర నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు తగ్గుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అతి త్వరలో రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి, అప్పుడు ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని పవన్ అన్నారు. గతంలో క్యాబ్ డ్రైవర్లు కొంతమంది మంత్రి నారా లోకేష్ ని కలిశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసాక తమ వాహనాలకు లైఫ్ టాక్స్ కట్టమని అంటున్నారని… తాము ఆల్రెడీ చెల్లించామని ఇప్పుడు మల్లి కడితే తీవ్రంగా నష్ట పోతామని.. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకోమని అర్జీ పెట్టుకున్నారు