యంగ్ హీరోయిన్ శ్రీలీలకు బాలీవుడ్లో మరో సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. నటుడు విక్రాంత్ మాస్సే హీరోగా తెరకెక్కుతున్న ‘దోస్తానా 2’ మూవీలో ఆమె భాగం కానున్నట్లు సమాచారం. ఇందులో విక్రాంత్ సరసన కథానాయికగా నటించనున్నారట. దీనిపై చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా, ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.