ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్ గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గోనున్నారు. అలాగే చిక్‌బళ్లాపూర్ జిల్లా చింతామణి గ్రామంలో జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. బెంగుళూరులో సాయంత్రం గోపాల్ గౌడ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.