CTR: చిత్తూరు నీవా నగరవనంలో గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితుల పక్షాన న్యాయవాదులు వాదనలు వినిపించకూడదని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు కోరారు. జిల్లా కలెక్టరేట్లో గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నా చేశారు. రాజకీయ పార్టీ నాయకులు స్వార్థ రాజకీయాలు వీడి నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.