NLG: బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంటు అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మామ సీనియర్ న్యాయవాది పాండురంగారెడ్డి మృతి బాధాకరం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. కలిసి హైదరాబాద్ సంతోష్ నగర్లోని పాండురంగారెడ్డి నివాసానికి చేరుకుని వారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.