PPM: భామిని ఏపీ మోడల్ స్కూల్ నందు అక్టోబర్ 7న జరగాల్సిన జాబ్ మేళాను కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా వేసినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య పేర్కొన్నారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ యువతీ యువకులు దీన్ని గమనించాలని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి తేది త్వరలో ప్రకటించడం జరుగుతుందన్నారు.