MBNR: మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని కేడిగుట్ట ప్రాంతానికి చెందిన సురేష్ గౌడ్ తండ్రి జంగయ్య గౌడ్ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ సోమవారం మృతుడి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడు చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.