కృష్ణా: ఎస్టీలు ఆర్ధికంగా స్థిరపడాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం నాగాయలంక మండలం నాలిలో ప్రజా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నాబార్డ్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన ఫీడ్ మేకింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం రూ.1.5 లక్షల వ్యయంతో సీడ్ యూనిట్స్ ఏర్పాటుకు సహకారం, రూ. 50 వేలతో రెండు సోలార్ డ్రయర్లు, ఐదు బోట్లు అందచేశారు.