ప్రకాశం: కంభంలోని విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని ఎస్సై నరసింహారావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజల్లో భద్రతా భావం పెంపొందించేందుకు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన చౌరస్తాలు, రద్దీ ప్రాంతాలు, మార్కెట్ ప్రాంతాల్లో పోలీసులు పహారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.