రాత్రి భోజనంలో చపాతీలు తినేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చపాతీలలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా రాత్రిపూట మన జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. చపాతీలు త్వరగా అరగకపోవచ్చు. చాలా మంది చపాతీలు తిన్న తర్వాత జీర్ణ సమస్యలు, గ్యాస్ లేదా ఉబ్బరం వంటి ఇబ్బందులు పడుతుంటారు. కావున నిద్రకు కనీసం రెండు గంటల ముందు చపాతీలు తింటే మంచిది.