SKLM: పలాస మండలం రంగోయి జీడి తోటల్లో మందస మండలం మఖరజోల గ్రామానికి చెందిన కె. కూర్మమ్మ (22) సోమవారం విఘతజీవిగా దర్శనమిచ్చింది. జీడి చెట్టుకి లైన్ తాడుతో ఉరి వేసుకుని మరణించినట్లు తెలుస్తుంది. కూర్మమ్మ మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిందా..? ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈమె భర్త చంద్రశేఖర్ విదేశాల్లో ఉన్నాడు. కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.