BHPL: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ సిబ్బందికి సూచించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో ఆర్వోలు, ఏఆర్వోలు, MPDOలు, నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సమగ్ర అవగాహనతో పనిచేయాలని ఆదేశించారు.