కోనసీమ: మండపేట మున్సిపాలిటీకి ‘స్వచ్ఛ మున్సిపల్ కార్యాలయం’, ‘స్వచ్ఛ మున్సిపాలిటీ’ విభాగాల్లో రెండు ప్రతిష్ఠాత్మక స్వచ్ఛాంధ్ర-2025 అవార్డులు లభించాయి. సోమవారం జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మహేశ్ కుమార్ చేతుల మీదుగా మున్సిపల్ ఛైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, కమిషనర్ టి.వి. రంగారావులు ఈ అవార్డులను అందుకున్నారు.