ఉదయాన్నే ఖాళీ కడుపుతో రాగిజావ తాగితే ఆరోగ్యానికి మంచిది. రాగి లోపల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారికి కూడా రాగిజావ మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎముకల బలానికి చాలా అవసరం. ఉదయాన్నే తీసుకుంటే ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా ఎముకలను కూడా బలపరుస్తుంది.