ప్రకాశం: దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 9 వరకు పొడిగించినట్లు డీఆర్వో ఓబులేసు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5వ తేదీతోనే ముగిసినా వరుస సెలవుల నేపథ్యంలో గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు దారులు ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.