NLG: జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి లావణ్య ఇవాళ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. డైట్ కాలేజీ సమీపంలో ఆమె మృతదేహం లభ్యం కావడంతో ఉలికిపాటుకు గురిచేసింది. ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు, నిందితుడైన ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ గౌడ్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.