MDK: మెదక్ జిల్లాలో వరద నష్టం అంచనా వేసేందుకు రేపు పర్యటించనున్న కేంద్ర బృందం పర్యటనకు మీడియాకు అనుమతి లేదని డిపిఆర్ఓ రామచంద్రరాజు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమతి లేదని తెలియజేశారు. పూర్తి సమాచారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నియమావళి మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులతో నిర్వహించబడుతుందన్నారు