VSP: విశాఖలోని దువ్వాడ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో భాగంగా ఆదర్శ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దుతామని తూర్పు కోస్తా రైల్వే, వాల్తేరు డివిజనల్ సీనియర్ మేనేజర్ పూజా సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆమె దువ్వాడలో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన ‘అమృత్ సంవాద’ సమావేశంలో, ప్రజా సంఘాలు, ప్రయాణికులు ఇచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించారు.