NGKL: రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం సాధించి, క్రీడా పాఠశాలలో 4వ తరగతికి ఎంపికైన విద్యార్థులను మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దేవ సహాయం అభినందించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చి, జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు.