SDPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కలిసి పని చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టపడితే మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మండలాల అధ్యక్షులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.