అన్నమయ్య: రాజంపేట సబ్ కలెక్టర్ భావన మంగళవారం పుల్లంపేట మండలం అప్పయ్యరాజుపేట రెవెన్యూ గ్రామంలో రీ సర్వే ప్రోగ్రాం పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు అక్కడ జరుగుతున్న సర్వే పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనంతయ్య గారి పల్లె గ్రామంలో సోలార్ సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.