BHNG: భువనగిరి పట్టణంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న కొమరయ్య (61) అనే వ్యక్తి ఇవ్వాళ ఆత్మహత్య చేసుకున్నాడు. కొమరయ్య, రెండేళ్లుగా మానసిక స్థితి సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మంగళవారం అతను చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.