ASR: హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని బస్కి గ్రామసభలో ఆదివాసీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మంగళవారం బస్కి సర్పంచ్ పాడి రమేష్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ సభలో గుగ్గుడు క్లస్టర్ పెసా కార్యదర్శి బాలదేవ్ మాట్లాడుతూ.. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు, జారీ చేసిన జీవోలను రద్దుచేసి ఆదివాసీల ఉనికిని ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్ చేశారు.