KRNL: తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ చట్టం -2007 ప్రకారం వృద్ధులకు జీవన భృతి, వారి పోషణను విస్మరిస్తే జరిమానా, జైలుశిక్ష వంటి చట్టాలు అమల్లో ఉన్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి స్పష్టం చేశారు. ఇవాళ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. వృద్ధుల ఆస్తి తీసుకుని నిర్లక్ష్యం చేస్తే ఆస్తిని రద్దు చేసే హక్కు ఉందని తెలిపారు.