NLG: మిర్యాలగూడ నుంచి మాడుగులపల్లి, చెర్కుపల్లి మీదుగా సూర్యాపేట వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సుల లేమితో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు లేక ఆటోల్లో అధిక చార్జీలు చెల్లించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ మార్గంలో వెంటనే ఆర్టీసీ సేవలు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.