టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా టెస్టుల్లో 4000 పరుగులు మైలురాయికి చేరువలో ఉన్నారు. వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో వారు ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. ఈ రికార్డును చేరుకోవడానికి జడేజాకు 10 పరుగులు, రాహుల్‌కు 111 పరుగులు అవసరం. ఇప్పటివరకు భారత్ తరఫున కేవలం 17 మంది క్రికెటర్లు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు.