MBNR: వరల్డ్ స్కిల్ కాంపిటీషన్-2025లో పాల్గొనేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15లోపు https://www.skilindiadigital.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. ఈ పోటీల్లో 63 కేటగిరీలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చని జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఉంటాయని చెప్పారు.