SDPT: ప్రపంచం ఉన్నంతవరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని జిల్లా కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఇతిహాసాల్లో మొదటిది రామాయణాన్ని వాల్మీకి రచించారని పేర్కొన్నారు.