TPT: హైదరాబాదులో జరిగే ఇంటర్ గ్రూప్ NCC కాంపిటీషన్స్కు పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల NCC విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ చంద్రమౌళి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అలవాటు పడతాయన్నారు. తృతీయ సంవత్సరం బీకాం విద్యార్థి శేషాద్రి, బీబీఏ విద్యార్థిని లావణ్య, బీఎస్సీ విద్యార్థిని గీత ఎంపికైనట్లు చెప్పారు.