MLG: కన్నాయిగూడెం మండల కేంద్రంలో మంగళవారం మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి ఆధ్వర్యంలో నూతన మండల మహిళా కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షురాలిగా కొరగట్ల అనిత, ఉపాధ్యక్షురాలిగా పుల్ల సుశీల నియమితులయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి, మండల అధ్యక్షుడు పాషా తదితరులు ఉన్నారు.