TG: బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ మంత్రులతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. ఈ అంశంపై హైకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కోర్టులో వినిపించాల్సిన వాదనలపై సీఎం రేవంత్ నేతలకు దిశానిర్దేశం చేశారు. రిజర్వేషన్ల పెంపు దిశగా న్యాయపరమైన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.