ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగి పడి 15 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.