W.G: అండర్-19 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తణుకు ఎస్.ఎన్.వి.టి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి జి.కీర్తి ఎంపికయ్యారు. ఇటీవల తణుకు ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాలలో జరిగిన పోటీల్లో ఆమె పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ వి.తులసి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా తరగతి అధ్యాపకురాలు స్వరూప అభినందించారు.