NDL: బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామంలో ఇవాళ వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీ ఇందిరమ్మ వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీసీ ఇందిరమ్మ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.