BDK: జల్ జంగిల్ జమిన్ నినాదంతో యువత ముందుకు సాగాలని ఆదివాసి జేఏసీ ఛైర్మన్ తాటి రామకృష్ణ అన్నారు. మంగళవారం కొమరం భీమ్ వర్ధంతి కార్యక్రమాన్ని చర్ల మండల కేంద్రంలో నిర్వహించారు. భీమ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులార్పించారు. కొమరం భీమ్ ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. వారి ఉద్యమ పోరాట ఫలితమే నేటి ఏజెన్సీ ప్రాంత చట్టాలు అని కొనియాడారు.