ATP: దివ్యాంగ విద్యార్థులు,పెద్దలకు అవసరమైన పరికరాలు, సర్టిఫికెట్లు అందించేందుకు ప్రతి మండలంలో శిబిరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సూచించారు. కరణం చిక్కప్ప పాఠశాలలో భవితా కేంద్రం నిర్వహించిన శిబిరంలో పాల్గొని అధికారులు దివ్యాంగుల సమస్యలు తెలుసుకుని సదుపాయాలు అందించాలన్నారు. అవసరమైతే CSR నిధులతో సహాయం చేస్తామన్నారు.