GNTR: జిల్లాలోని పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హామీ ఇచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. పోలీసుల సంక్షేమానికి కృషి చేయాలని వారు ఎస్పీని కోరారు.