MNCL:పెండింగ్ వేతనాలు చెల్లించి, సక్రమంగా EPF, ESI జమ చేయని ఏజెన్సీ పై విచారణ చేపట్టి న్యాయం చేయాలని BC హాస్టల్ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం CITU ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ AOకి వినతిపత్రం అందజేశారు. గత 10 నెలలుగా వేతనాలు ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. డబ్బులు అకౌంట్ లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.