NGKL: జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు సహకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ప్రతినిధి ఆశ్లేష మిశ్రాకు అదనపు కలెక్టర్ అమరేందర్ మంగళవారం ప్రశంసా పత్రాన్ని అందజేశారు. భవిష్య భారత్ సంస్థ ద్వారా మొబైల్ ఎక్స్‌రే సేవలు అందించి, క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి సహకరించినందుకు SBI ట్రస్ట్‌ను ఆయన అభినందించారు.