TG: సిరిసిల్లలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టమైన రథోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన సిరిసిల్ల రథాన్ని పురవీధుల్లో ఊరేగిస్తుండగా, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. ఈ ఉత్సవాల్లో మాజీమంత్రి KTR పాల్గొని స్వామికి పూజలు చేశారు. దీంతో సిరిసిల్లలో భక్తుల కోలాహలం నెలకొంది.