GNT: తుళ్లూరు(M) అనంతవరంలో అనధికారికంగా నిర్వహిస్తున్న గోశాలను వెంటనే తొలగించాలని మండల పశు వైద్యాధికారి రేణుక నోటీసులు జారీ చేశారు. నీడ, దాణా, సదుపాయాలు లేక గోవులు చిక్కిపోతున్నాయని, గోవులు ఉంచిన ప్రదేశం CRDA పరిధిలో ఉందని ప్రవేశానికి అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. గోవులను సురక్షితమైన అనుమతి పొందిన ప్రదేశానికి అత్యవసరంగా 2 రోజుల్లో తరలించాలన్నారు.