KDP: మైదుకూరులోని APSRTC పెట్రోల్ బంక్ అక్రమ నిర్మాణాన్ని తాహసీల్దార్ నరేంద్ర, పురపాలక కమిషనర్ రంగ స్వామి మంగళవారం సంయుక్తంగా పరిశీలించారు. వాగు ఆక్రమణను తక్షణమే తొలగించి, పురపాలక నిబంధనల ప్రకారం మార్జిన్ వదలాలని డీఎం శ్రీలతకు సూచించారు. ఈ వ్యవహారంపై నవంబర్ 7న లోకాయుక్త వాయిదా ఉంది. వర్షపు నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు.