NLR: కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎం వి కృష్ణయ్య ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండల విద్యాశాఖ అధికారి సురేష్, ఉపాధ్యాయులు మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.