TPT: వడమాలపేట మండలం వడమాలపేట టౌన్లో నియోజకవర్గ YCP ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ రాజారెడ్డిని మాజీ మంత్రి రోజా పరామర్శించారు. ఆయన ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆయన నివాసానికి వెళ్లి రాజారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు.