MLG: కొమరం భీం స్ఫూర్తితో రాష్ట్రంలో ఐటీడీఏల ఏర్పాటు, అభివృద్ధి జరిగిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంగళవారం కొమరం భీం వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీ హక్కుల కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ప్రభుత్వం ఆదివాసీ అభివృద్ధికి ప్రత్యేక చట్టాలు చేసిందని తెలిపారు.