MBNR: అడ్డాకుల మండలంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా కలెక్టర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అక్కడ రోగులకు దొరుకుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయం అలాగే తహసీల్దార్ కార్యాలయాలను పరిశీలించి అక్కడి రికార్డులను పరిశీలించారు.